Monday, December 23, 2024

చీతాల రప్పింత సాగుతుంది: మార్కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోకి తిరిగి చీతాలను రప్పించే ఆగబోదని, ఇది కొనసాగుతుందని చీతా పరిరక్షణ ఫండ్ వ్యవస్థాపకులు లౌరీ మార్కర్ తెలిపారు. ఇతర దేశాల నుంచి చీతాలను తెప్పించిన క్రమంలో అవి ఇక్కడి వాతావరణానికి సర్దుబాటు కాలేని దశలో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిరుతలు క్రమేపీ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయని, ఇక చీతా ప్రాజెక్టుకు ఎటువంటి సవాళ్లు ఉండబోవని ఆమె తెలిపారు. ఇప్పటికప్పుడు చీతాల మరణాలు ఆగిపోతాయని చెప్పలేమని వివరించారు. దేశంలో అంతరించిపోతున్న దశలో ఉన్న చీతాలను తిరిగి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని చేపట్టడంలో మార్కర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కొన్ని గుణపాఠాలు ఎదురయ్యాయి. లక్ష సాధన దిశలోనే ఈ ప్రాజెక్టు సాగుతోందని అనుకుంటున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News