- Advertisement -
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. బుధవారం ఉదయం మరో చీతా చనిపోయింది. తాజాగా ధాత్రి అనే మరో ఆడ చీతా మృతి చెందిందని పార్క్ అధికారులు వెల్లడించారు. అలాగే పోస్ట్‌మార్టమ్ తరువాత మరణానికి కారణాలు తెలుస్తాయన్నారు.
ఐదు నెలల వ్యవధిలో ఇప్పటివరకు తొమ్మిది చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. “ ప్రాజెక్టు చీతా ”లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేవరకు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్ని చీతాల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వాటికి రేడియో కాలర్స్‌ను అమర్చారు. అయితే ఇంతలోనే వరుసగా చీతాల మరణాలు సంభవిస్తున్నాయి.
- Advertisement -