Thursday, January 23, 2025

నా జన్మ ధన్యమైంది: వంట మాస్టర్ యాదమ్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను నా చేతితో వండి వడ్డించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నా జన్మ ధన్యమైందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వంట మాస్టర్ యాదమ్మ చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో వచ్చిన వర్తల్ని యాదమ్మ ఖండించారు. కొందరు కావాలని ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె బాధపడ్డారు. తనను నోవాటేల్ లోకి రానివ్వలేదని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియా యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని, తనకు వాళ్ళ దుర్బుద్ధి అర్థం కాలేదని ఆమె చెప్పారు. తాను నోవాటేల్ దగ్గరకు రాగానే బండి సంజయ్ కారు పంపి తనను వెంటనే లోపలికి తీసికెళ్లి గొప్పగా చూసుకున్నారని ఆమె అన్నారు. లోపలికి వెళ్ళగానే ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసి అవకాశం దక్కడం జీవితంలో మరిచిపిలేనని ఆమె అన్నారు. ప్రధాని సహా దేశంలోని మహా మహులకు వండి పెట్ట అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్ కు శతకోటి దండాలు.. ఆయనకు రుణపడి ఉంటా అని యాదమ్మ అన్నారు.

Chef Yadamma about cooking for PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News