Monday, December 23, 2024

‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి చెలియా చాలు సాంగ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి చెలియా చాలు అనే పాటని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

రధన్ ఈపాటని సోల్ ఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. వి యశస్వి అందించిన సాహిత్యం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంజిత్ హెగ్డే వాయిస్ మెస్మరైజింగా వుంది. ఈ పాటలో కథానాయకుడిని ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడం క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News