అందం, ప్రతిభ.. ఈ రెండూ రాజమౌళి సినిమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. హీరోయిన్లను తెరపై గ్లామరస్ గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. హీరోయిన్ల సెలక్షన్ లో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పక్కన నటించేందుకు లండన్ కు చెందిన ఒలీవియా మోరిస్ ను ఎంచుకున్నారు. అందం, అభినయం కలబోసిన ఒలీవియా ఓ థియేటర్ ఆర్టిస్ట్.
తాజాగా మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న మూవీ కోసం రాజమౌళి కళ్లు ఇండోనేసియా నటి చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పై పడ్డాయి. ఆమె ఇండోనేసియాలో పేరున్న నటి. అమెరికాలో పుట్టి, ఇండొనేసియాలో స్థిరపడిన ఇస్లాన్ ఇప్పటికే అనేక సినిమాల్లో నటించింది. 2013లో ‘మే ది డెవిల్ టేక్ యు’ అనే హాలీవుడ్ మూవీ ద్వారా వెండితెరపైకి వచ్చిన ఇస్లాన్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతూ ఉండటం విశేషం. 1995లో పుట్టిన ఇస్లాన్ రెండేళ్ల క్రితం రాబ్ క్లింటన్ కార్డినల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.