Sunday, December 22, 2024

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జయపురలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News