Tuesday, January 28, 2025

బట్టబయలైన కెమికల్ స్కాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లంగర్ హౌస్ త్రివేణి సంఘం వద్ద తాండూర్, కర్ణాటక, పటాన్ చెరు, షాద్ నగర్, తదితర ఇండస్ట్రీల నుంచి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసీలో వదులుతున్నారు. అయితే మూసి వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక లారీల పార్కింగ్ పెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసిలోకి ఏకంగా పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసిలో వదులుతున్నారు. దీనివల్ల ఇక్కడ మూసి కలుషితం కావడంతో పాటు దుర్గంధం, స్థానికులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. లారీలు రావడం గమనించిన స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా నాలుగు లారీలతో పాటు పారిపోయారు. కెమికల్ కాళీ చేస్తున్న లారీని మాత్రం ప్రస్తుతం పట్టుకున్నారు. భారీ ట్యాంకర్ కావడంతో ఒక్కొ ట్యాంకర్ కు 25000 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిసింది.

సుభాష్ నగర్ లాస్టు బసుస్టాప్ రోడ్డులోని సోమవారం రాత్రి ఒక్కసారిగా భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపురంగులో రసాయనాలు ఉబికి పైకి వచ్చాయి. దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తిగా రసాయనాలు ఎరుపురంగులో ఉండి విపరీతమైన దుర్వాసన వెలువడిందని కాలనీవాసులు పేర్కొన్నారు. స్థానికంగా కొంతమంది రీసైక్లిం గ్ పరిశ్రమలను నిర్వహిస్తూ రసాయనాల డ్రమ్ములను కడిగి నాలాల్లో పారబోయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పిసిబి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అనుమతులు లేకుండా కాలనీలో ఇళ్లమధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News