మార్కెట్లో పండ్ల
కొనుగోళ్ళపై వెనకడుగు వేస్తున్న వినియోగదారులు
రసాయనాలతో
పండించిన పండ్లపై
అవగాహన కల్పించని అధికారులు
హైదరాబాద్ : సహజంగా వేసివి అంటే అందరికి గుర్తుకు వచ్చేది. తియ్యని మామడి పండ్లు, తాటి ముంజలు, గిన్నె పండ్లు. అయితే మొదటగా మామిడి పండ్ల పక్వానికి వచ్చే పద్ధతి అందరికి అనుమానాలు ఉన్నట్లుగా మిగతా వాటిపై ఉండదు. ఎందుకంటే అవి సహజంగా పండే అవకాశమే ఎక్కువగా ఉండటమే కారణం. కాని మధుర ఫలంగా అంద రి మనసు దోచిన మామిడి పండుపై రసాయనాల ప్రభావం పడుతోంది. వీటిని అమితంగా ఇష్టపడే వా రు సైతం వీటి కొనుగోళ్ళపై ఆలోచనపడుతూ ఈ పం డ్లను కొనాలి, తినాలి అనే కోరికను బలవంతంగా చం పుకుంటున్నారు. చూడగానే కొనాలనిపిస్తున్నా అవి సహజంగా పండిందా లేదా రసాయనలతో పండించారా అనే అమనమానం మామిడిని పండును దూరం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సహజంగా పండిన పం డుకు బంగారం వర్ణం రాదు.
ఇది ఆహార పరీక్షలు చేసే మార్కెటింగ్ శాఖ అధికారులకు సైతం తెలుసు కు. నగరంలో ఎక్కడా చూసినా బంగారు వర్ణంతో మెరిసిపోతున్న మామాడి పళ్ళు కనిపిస్తున్నా.. వాటి ని తనిఖీ చేసే కృత్రిమంగా మగ్గబెతున్న వారిపై చర్య లు తీసుకోకపోడంతో దాని ప్రభావం ప్రజలో ఆరోగ్యంపై పడుతోంది. ఎండనక వానక పండించిన రైతుకు వీటి విషయంలో ఏమి తెలియదు. కేవలం తన పంటను మార్కెట్‌కు తరలించి తద్వారా వచ్చిన డబ్బును తీసుకోవడం మినహ. అదే విధంగా వాటిని కొనుగోలు చేసే వినియోగదారునికి కూడా వాటి గురించి ఏమీ తెలియదు. కాక పోతే ఇవి సజంగా పండించినవా లేదా, ధర తగ్గిస్తావా లేదా అని అడగడం తప్ప. మామిడిని టోకుగా కొనుగోలు చేసి అమ్మాలనుకునే మధ్య దళారీ మాయాజలానికి పాల్పడి హానికరమైన రసాయనాలతో మామిడి పండు ను విషతుల్యం చేస్తున్నారు. హానికరమైన రసాయనాలతో మగ్గబెట్టి మధురఫలమైన మామిడి విషతుల్యం చేస్తున్నారు. సీజన్ కావడంతో గడ్డాన్నారం పండ్ల మార్కెట్‌కు మామాడి పొటెత్తుతోంది.
ఇదే అదునుగా దళారీలు, వ్యాపారులు కుమ్మక్కై కాయలను పండ్లు మగ్గించేందుకు రసాయనాలతో కూడిన పౌడర ప్యాకెట్లును జత చేసి పండ్లను రవాణా చేస్తున్నారు. సహజంగా పక్వానికి వచ్చిన కాయ పండు అవ్వాలంటే గడ్డిలో మాగబెడితే వారం రోజుల నుంచి10 రోజులకు పండు అవుతుంది. కానీ రసాయనాలు వాడటం వల్ల రెండు మూడు రోజులకు కాయ పండు అవుతోంది. రవాణా చేసేందుకు అనువుగా ప్లాస్టిక్ ట్రేలలో ఒక వరుస మామాడి కాయలు వాటిపై రసాయన పౌడర్ ప్యాకెట్లు రెండు పెట్టి పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్రాల కు యధేచ్చగా రవా ణా చేస్తున్నారు. ఇవి రెండు మూ డు రోజులకే బంగారపు వర్ణాన్ని సంతరించుకుని వినియోగ దారులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో గడ్డన్నారంలో పండ్ల మార్కెట్‌ను వేదిక చేసుకుని ఇదివరకు రసాయనాలు వాడిని వ్యాపారులు తమ పం థాను కూడా మార్చుకున్నారు. నగర విశివార్లలలోని గోదాములకు తీసుకు వెళ్ళి అక్కడే రసాయనాలు చల్లుతున్నారు. యార్డులో విక్రయాలు జరగ్గానే కొనుగోలు చేసిన వ్యాపారులకు కాయలను రవాణా చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ ట్రేలను సిద్దంగా ఉంచుకుని మామాడి కాయలలకు ఈ ప్యాకెట్లు జత చేసి నగరంలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
ఊరు ఉండదు.. పేరు ఉండదు
తెల్లటి ప్యాకెట్లో ఈ రసాయనం కినిపిస్తుంది. ఎక్కడ నుంచి వచ్చింది? ఈ ప్యాకెట్‌ల మీద ఎవరు తయారు చేశారు ? లాంటి వివరాలు ఏ మాత్రం కనింపచవు. ముంబయి నుంచి వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చైనా పౌడర్ అని కూడా పిలుస్తున్నారు. ఉత్త ప్యాకెట్లపై ఇత్లెయిన్ ప్రూట్ రైపనర్ అని మాత్రమే రాసి ఉంటుంది. గతంలో కాల్షియం కార్బైన్ వినియోగించిన వారు ఇప్పుడు చైనా ప్యాకెట్లను వాడుతున్నారు. ఒక్కో వరసకు రెండు చొప్పున ప్యాకెట్లను వేస్తే అవి రెండు మూడు రోజులకు పండ్లుగా అయిపో తున్నాయి.
అవగాహన చర్యలు కల్పించని అధికారులు :
రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఎలా ఉంటాయి. వాటిని ఏ విధంగా గుర్తించాలి అనే అంశాలపై ప్రజలకు అధికారులు అవగాహన చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారు.దీన్ని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కొందరు తమ పండ్ల దుకాణాల వద్ద “ ఈ మామీడి పండ్లు సహజంగా పండించినవి ” అంటూ బోర్లు పెట్టి మరీ అమ్ముతున్నారు.కొందరు తినాలనే కొరికను చంపుకోలేక వాటిని కొనుగోలు చేస్తుంటే మరి కొందరు కొనాలా వద్దా? తినాలా వద్ద అనేఅనుమానంత వెనుకడుగు వేస్తున్నారు. ఏది ఏమైన అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి రసాయాలతో పండించిన మామాడి పండ్లను గుర్తించడమే కాకుండా అటువంటి వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.