Monday, January 20, 2025

చమ్మక్ చమ్మక్ పోరీ…

- Advertisement -
- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు ‘మీటర్’ చాలా ప్రత్యేకమైన చిత్రం. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మొదటి సింగిల్ ‘చమ్మక్ చమ్మక్ పోరీ’ని విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎంలో భారీ జనసందోహం సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..“సాయి కార్తిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటే కాదు ఇందులో పాటలన్నీ బావుంటాయి. భాను మాస్టర్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. మంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల కోసం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశాం. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ మీటర్ ఎక్కడా తగ్గదు’ అని అన్నారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ “సాయి కార్తిక్ చాలా మంచి సాంగ్ ఇచ్చారు. జేవీ అద్భుతమైన సెట్ చేశారు. ఈ పాట కోసం యాభై లక్షలు అనుకున్న సెట్ కోటి రూపాయిలు అయ్యింది. కానీ పాట అద్భుతంగా వచ్చింది. కొరియోగ్రఫర్ భాను మాస్ స్టెప్పులు గ్రేస్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమేష్, సాయి కార్తిక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News