Monday, December 23, 2024

రోడ్డెక్కిన చెంచు మహిళలు

- Advertisement -
- Advertisement -

బల్మూర్ : మండల కేంద్రంలోని చెంచు కాలనీల్లో వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సం బంధిత గ్రామ పంచాయతి అధికారులకు, సర్పంచుకు చెప్పినా పట్టించుకోవడం లేదని సోమవారం ఉదయం అచ్చంపేట, లింగాల ప్రధాన రహదారిపై కాలనీవాసులు గంటసేపు ఖాళీ బిందెలతో రోడ్డుబై బైఠాయించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వారం రోజులుగా మంచినీటి సమస్య ఉందని చెప్పినా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విసుగు చెందిన మహిళలు రోడ్డుపై బైఠాయించారని, గ్రామ సమీపంలో గల బోరు దగ్గరి నుంచి తాగునీరు తెచ్చు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News