Wednesday, January 22, 2025

అక్టోబర్ 21న వెస్ట్ లండన్‌లో చేనేత బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
చేనేత కుటుంబాలకు అండగా ఉండాలని సూచనలు

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 21న నిర్వహిస్తున్న లండన్ – చేనేత బతుకమ్మ – దసరా వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను చేనేత బతుకమ్మగా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు టాక్ అధ్యక్షులు రత్నాకర్ తెలిపారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ఫోన్ ద్వారా మీడియాకు తమ సందేశాన్నిస్తూ టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి చేనేత బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించి అలాగే ఆశీర్వదించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవిత గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. అన్నివేళలా వారి సూచనలు సలహాలు మాకెంతో ప్రోత్సహాన్ని కలిగిస్తున్నాయని , చేనేత కుటుంబాల సంక్షేమం పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందని, ఇటువంటి కార్యక్రమాల వల్ల వారికి వీలైనంత చేయూత అందితే చాలా సంతోషమని కవిత తెలిపారు. యూకే లో నివసించే ప్రవాస ఆడబిడ్డలంతా వేడుకల్లో పాల్గొని మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేద్దామని, ఈ సంవత్సరం అక్టోబర్ 21న సాయంకాలం మన ఊర్లో జరిగినట్టు వేడుకులు నిర్వహిస్తున్నామని, ప్రవాసులంతా సాయంత్రం 4 గం.ల నుండి వెస్ట్ లండన్ లోని ‘ లంప్టోన్ స్కూల్ ఆడిటోరియంలో జరిగే వేడుకలకు, చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనమంతా చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు.

మరిన్ని వివరాలకు www.tauk.org.uk వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేత దుస్తులతో వేడుకలను జరుపుకుంటే, చేనేత కుటుంబాలలో గొప్ప భరోసా వస్తుందని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీ ఎమ్మెల్సీ ంగాధర్ గౌడ్, టాక్ వ్యవస్థాపకులు – తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృది సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ,తెలంగాణ సామాజిక కార్యకర్తలు తిరుమందాస్ నరేష్ గౌడ్, బత్తిని వినయ్, నాగరాజు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News