Saturday, November 16, 2024

చేనేత మిత్ర అమలు ఘనత కేటీఆర్ దే!

- Advertisement -
- Advertisement -

మంత్రికి పద్మశాలి నేతల కృతజ్ఞతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో చేనేత మిత్ర పథకాన్ని ప్రకటించి అమలు పరిచిన ఘనత మంత్రి కెటిఆర్‌కే దక్కుతుందని పద్మశాలీ సంఘం నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించిందని సంఘం నేతలు కొనియాడారు. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ కలిగిన ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుని ఖాతాలో జమ చేస్తామని ప్రకటించి, సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో రూ.500 చొప్పున జమ చేసినట్లు తెలిపారు. దీంతో చేనేత వృత్తిలో కొనసాగుతున్న వేల మంది కళాకారులకు ఆర్ధిక సాయం లభించిందని తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎల్ రమణ ద్వారా జగిత్యాల పద్మశాలి నాయకులు సచివాలయంలో చేనేత జౌళి శాఖ మంత్రి కెటిఆర్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన్నకు భీమా పథకంలో 59 సంవత్సరాల వయసు పరిమితిని సడలించి 75 సంవత్సరాలకు పెంచినందుకు చేనేత వృత్తిలో కొనసాగుతున్న నిరుపేద వృద్ధ కళాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏ కారణంతోనైనా నేత కార్మికుడు చనిపోతే అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు సహాయం అందనుందని తెలిపారు. మరణించిన చేనేత కార్మికుడి కుటుంబాలకి తక్షణ అవసరాల కోసం జౌళి శాఖ నుండి రూ. 25 వేలు సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతగానో ఉపయోగకరమని అన్నారు. . నేత కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి సంవత్సరానికి రూ. 25 వేల రూపాయల వరకు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ వైద్యం లభించే సౌకర్యం కల్పించడం, నేత కార్మికులందరిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం వల్ల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్ని పథకాలు రూప కల్పన చేసి అమలుపరుస్తున్నందుకు వారు మంత్రికి కధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమణ మంత్రి కెటిఆర్‌ను శాలువాతో సత్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News