- Advertisement -
చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో భారీ వానలు పడుతున్నాయి. చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగకుండా కురుస్తున్న వానలో బయటికి అడుగు పెట్టడానికి కూడా జనం జంకుతున్నారు. ఇదిలావుండగా చెన్నై విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అనేక విమానాలు నిలిచిపోయాయి. దిగాల్సిన కొన్ని విమానాలను బెంగళూరుకు మళ్లించారు. చెన్నై విమానాశ్రయంలో ఇప్పటి వరకు 31 విమానాలకు అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
- Advertisement -