Wednesday, April 16, 2025

లక్నోపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 18వ సీజన్‌లో భాగంగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై జట్టుకి ఈ మ్యాచ్‌లో విజయం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో కానీ ఓడిపోతే.. ఆ జట్టుకు ప్లేఆఫ్ ఆశలు లేనట్టే. ఇక లక్నో ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనే చేస్తోంది. ఆడిన ఆరు మ్యాచుల్లో 4 మ్యాచుల్లో విజయం సాధించిన లక్నో.. ఈ మ్యాచ్ విజయంపై కూడా కన్నేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై రెండు మార్పులు చేసింది. అశ్విన్, కాన్వాయ్‌ల స్థానంలో ఓవర్‌టన్, రషీద్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక లక్నో ఒక మార్పుతో బరిలోకి తీసుతోంది. హిమ్మత్ సింగ్ స్థానంలో మార్ష్ జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News