Tuesday, December 17, 2024

నటి కస్తూరి కోసం గాలిస్తున్న తమిళనాడు పోలీసులు

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి,  చిక్కుల్లో పడిన నటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కస్తూరికి ఇటీవల నోటీసులు ఇచ్చేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించగా, ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం కనిపించింది. దాంతో వారు ఆమె పరారీలో ఉన్నట్టు నిర్ధారించారు.

తర్వాత ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై పోలీస్ కమిషనర్ తాజాగా కస్తూరి కోసం ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించారు. కస్తూరి ఏపీలో ఉండొచ్చన్న అనుమానంతో చెన్నై పోలీసులు అక్కడ కూడా గాలించనున్నారు. కాగా, కస్తూరి తమిళనాడు నుంచి పరారవడానికి ఓ కోలీవుడ్ నిర్మాత సహాయపడినట్టు తెలుస్తోంది. అతడి సంగతి తర్వాత తెలుస్తుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కస్తూరి బిజెపి తరఫున ప్రచారం చేసినా, తాజా వివాదం నేపథ్యంలో బిజెపి కూడా ఆమెకు దూరంగా ఉంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News