Tuesday, December 24, 2024

తిరుమల శ్రీవారికి విరాళంగా ఖరీదైన బస్సులు..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న భక్తితో పలవురు భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలు ఇస్తుంటారు. ఒక్కోసారి ఖరీదైన బహుమతులను కూడా శ్రీవారు అందుకుంటుంటారు. తాజాగా ఓ తమిళ భక్తుడు స్వామివారికి ఖరీదైన రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావులు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను శుక్రవారం ఉదయం టీటీడీకి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి స్వామివారి ఆలయం వద్ద రెండు బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాల తాళాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News