Thursday, January 23, 2025

తల్లికి వైద్యం చేయలేదని డాక్టర్ను ఏడుసార్లు కత్తితో పొడిచాడు..

- Advertisement -
- Advertisement -

తన తల్లికి వైద్యం సరిగా చేయలేదని ఓ యువకుడు డాక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరుంగళత్తూరుకు చెందిన విఘ్నేష్ అనే యువకుడి తల్లి ప్రేమ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీంతో ఈ ఏడాది మే నుంచి నవంబర్‌ వరకు తన తల్లి ప్రేమకు చెన్నైలోని కలైంజర్ సెంటినరీ హాస్పిటల్‌లో యువకుడు క్యాన్సర్‌ వైద్యం చేయించాడు. అయితే, ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌తో గొడవపడ్డాడు.

చికిత్స చేసినా.. తన తల్లి పరిస్థితి విషమంగా ఉందని వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన విఘ్నేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ ను ఏడుసార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనితోపాటు వచ్చిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ను ఐసీయూకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News