Sunday, January 19, 2025

తలలో దూసుకెళ్లిన మేకు… ఆరు గంటల ఆపరేషన్‌తో తొలగింపు

- Advertisement -
- Advertisement -

చెన్నె : ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల కార్మికుడు తమిళనాడు బ్రహ్మ , నవలూర్ లోని ప్యాకేజింగ్ పరిశ్రమలో పనిచేస్తుండగా తల వెనుక మేకు గుచ్చుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆరు గంటల పాటు ఆపరేషన్ చేసి మేకును తొలగించారు. ప్యాకేజింగ్ పరిశ్రమలో పనిచేస్తుండగా, తోటి కార్మికుడు చెక్క డబ్బాలకు మేకులు కొడుతుండగా, అదే సమయంలో బ్రహ్మ అక్కడే ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో తలవెనుక మేకు దూసుకెళ్లింది. భరించరాని నొప్పితో విలవిల్లాడుతున్న బ్రహ్మను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తోటి కార్మికుడి పరికరం నుంచి ఓ మేకు ప్రమాదవశాత్తు అతడి తల, మెడ కలిసే భాగంలో చొచ్చుకెళ్లినట్టు తోటి సిబ్బంది గుర్తించారు. కపాలం, వెన్నెముకల మధ్య సంక్లిష్టమైన భాగంలో మేకు దిగింది. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే మాట పడిపోవడం, పక్షవాతం , మరణం వంటి ముప్పు పొంచి ఉంటుంది. ఆపరేషన్ సవాలుగా మారడంతో అత్యంత జాగ్రత్తగా మేకు చుట్టూ ప్రత్యేక పరికరాలతో సున్నితంగా డ్రిల్ చేసి దాన్ని తొలగించాం అని వైద్యులు తెలిపారు. బాధితుడు కోలుకుంటున్నాడని , రెండో రోజు డిశ్చార్జి చేసినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News