గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో కొందరు ఆటగాళ్లు ఎంత ఫేమస్ అవుతారో.. స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న అభిమానుల్లో కొందరు కూడా అంతే ఫేమస్ అవుతారు. తమ అభిమాన ఆటగాళ్లను సపోర్ట్ చేయడానికి వచ్చే వీళ్లు ఓవర్‌నైట్‌లో స్టార్స్ అవుతారు. గత సీజన్లలో కూడా పలువురు అమ్మాయిలు కెమెరాకు చిక్కి ఫేమస్ కాగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మరో అమ్మాయి చేరింది.
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి ఒక ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్‌లో తలా ధోనీ ఉన్నాడు. అయితే సందీప్ శర్మ వేసిన ఆ ఓవర్‌లో ధోనీ సిక్సు కొట్టేందుకు ప్రయత్నించగా.. ఆ బంతిని హెట్మైర్ అద్భుతంగా క్యాచ్ పట్టి ధోనీని ఔట్ చేశాడు. ఈ వికెట్‌కి ఓ చెన్నై అభిమాని ఇచ్చిన రియాక్షన్ మామూలుగా లేదు. ధోనీ ఔట్ అయ్యాడనే నిరుత్సాహం.. క్యాచ్ పట్టిన హెట్మైర్‌పై కోపం ఒకేసారి చూపిస్తూ.. ఆ అమ్మాయి రియాక్షన్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని కెమెరామెన్ తన కెమెరాలో బంధించగా.. అది కాస్త వైరల్ అయింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేయగా.. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాదించింది.