Monday, January 20, 2025

సిబిఎస్‌ఈలో 500/500 మార్కులు సాధించిన చెన్నై అమ్మాయి!

- Advertisement -
- Advertisement -

చెన్నై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఈ) మే 12న 20లక్షల 10వ తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. బోర్డు ఈసారి మెరిట్ జాబితాను విడుల చేయనప్పటికీ చెన్నైకి చెందిన సంజనా భట్ సాధించిన స్కోరు ఖచ్చితంగా సిబిఎస్‌ఈ టాపర్ 2023లో ఒకరిని చేసింది.

సిబిఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు 2023లో నూరు శాతం పొందేందుకు సంజనా భట్ 500కి 500 మార్కులు సాధించింది. ఆమె సిబిఎస్‌ఈ బోర్డుతో పాటు తన పాఠశాల పద్మా శేషాద్రి బాలభవన్, నుంగంబాక్కంలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఇంగ్లీషు, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్ అన్ని సబ్జెక్టులలో పూర్తి మార్కులు సాధించడం విశేషం. సంజన తల్లి శుభ సర్జన్‌గా పనిచేస్తున్నారు. తన కూతురు సాధించిన దానికి ఆమె గర్వంగా, సంతోషంగా ఫీలవుతున్నారు. ఇదే సమయంలో ఆమె భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. సంజనా చిన్నతనం నుంచే ప్రతిభ కనబరుస్తోందని ఆమె అన్నారు. తన కూతురు రెగ్యులర్‌గా చదివుతుండేదని, ఎప్పుడూ చదువులో బోర్ ఫీలవ్వలేదని అన్నారు. అసైన్‌మెంట్లు కూడా నిర్ణీత సమయానికి కంటే ముందే చేసేసేదని తెలిపారు.

ఇంట్లో అంతా డాక్టర్లే ఉన్నప్పటికీ సంజనా ఇంజనీర్ చేయాలనుకుంటోంది. జెఈఈ అడ్వాన్స్‌కు, ఐఐటికి ప్రయత్నించాలనుకుంటోంది. ఇదే విషయాన్ని సంజన తల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News