Monday, December 23, 2024

100 మంది ఉద్యోగులకు కార్లు బహూకరించిన చెన్నై ఐటి సంస్థ

- Advertisement -
- Advertisement -

Chennai IT .. 100 cars

చెన్నై (తమిళనాడు): చెన్నైకి చెందిన ఒక ఐటి సంస్థ సోమవారం తన ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది.
ఐడియాస్2ఐటి అనే ఐటీ సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ సుజుకి కార్లను బహుమతిగా ఇచ్చింది. నిరంతర మద్దతు, కంపెనీ విజయం, వృద్ధికి అసమానమైన సహకారం అందించినందుకుగాను వారికి కానుకను ఆ కంపెనీ ఇచ్చింది.

‘‘పదేళ్లకు పైగా మాలో భాగమైన 100 మంది ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇస్తున్నాం. మాకు 500 మంది ఉద్యోగుల బలం ఉంది. మనం పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు అందించాలన్నదే మా కాన్సెప్ట్‌’’ అని  ఐడియాస్2ఐటి మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ చెప్పారు.

ఐడియాస్2ఐటి వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళీ వివేకానందన్ మాట్లాడుతూ ‘‘ఉద్యోగులు తమ సంస్థ అభివృద్ధికి ఎంతో చేశారు, కంపెనీ వారికి కార్లు ఇవ్వడం లేదు, అది వారు తమ కష్టార్జితంతో సంపాదించుకున్నారు’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News