Monday, December 23, 2024

సర్ ప్రైజ్: ఉద్యోగులకు 50 కార్లు కొనిచ్చిన ఐటీ కంపెనీ..

- Advertisement -
- Advertisement -

ఓ ఐటీ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దీంతో ఆ ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. చెన్నైలో గిండి ఐటీ కారిడార్ లోని ఐడియాస్2ఐటీ అనే కంపెనీ తమ ఉద్యోగుల హార్డ్ వర్క్ ను గుర్తించి.. వారిని సర్ ప్రైజ్ చేస్తూ కొత్త కార్లు కొని గిఫ్టుగా ఇచ్చింది. 2009లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం మంచి లాభాల్లో కొనసాగుతోంది.

మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వచ్చినా.. ఉద్యోగుల సపోర్ట్ తో నిలదొక్కుని విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో దీర్ఘకాలంగా కంపెనీలో పనిచేస్తూ..తమకు అండగా నిలబడిన ఉద్యోగులకు ఏదైనా అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు యాజమాన్యం. ఈక్రమంలో ఓ 50మంది ఉద్యోగులను గుర్తించి వారికి నచ్చిన కార్లను బహుమతిగా అందజేసింది. గతంలోనూ ఈ కంపెనీ.. 100 మంది ఉద్యోగులకు కొత్త కార్లను కొని గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News