- Advertisement -
చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఢిల్లీ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లోనే అతనికే క్యాచ్ ఇచ్చి రవీంద్ర(3) ఔట్ కాగా.. ఆ తర్వాత స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో గైక్వాడ్(5) మెక్‌గ్రాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక విప్రాజ్ నిగమ్ వేసిన ఆరో ఓవర్‌లో కాన్వాయ్(13) అక్షర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక విప్రాజ్ వేసిన 10వ ఓవర్‌లో శివమ్ దూబే(18) స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజ్‌లో విజయ్ శంకర్(19), జడేజా(2) ఉన్నారు.
- Advertisement -