Monday, December 23, 2024

చెన్నై మేయర్ డిఎంకె అభ్యర్థిగా ఎస్‌సి మహిళ ఆర్. ప్రియ

- Advertisement -
- Advertisement -

Chennai mayor DMK candidate SC woman R. Priya

 

చెన్నై : గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ పదవికి అభ్యర్థిగా ఎస్‌సి వర్గానికి చెందిన 28 ఏళ్ల ఆర్. ప్రియను డిఎంకె ప్రతిపాదించింది. తిరువి క నగర్ జోన్ 74 వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2016 లో మద్రాస్ యూనివర్శిటీ ఎంకామ్ పట్టా పుచ్చుకున్న ప్రియ శుక్రవారం ఆనవాయితీ ప్రకారం ఎన్నికలు జరిగిన తరువాత చెన్నై కార్పొరేషన్ చరిత్రలో యువ మేయర్‌గా రికార్డు కెక్కుతారు. చెన్నై కార్పొరేషన్‌కు ఎంపికవ్వబోతున్న రెండో మహిళ ప్రియ. 1971 72 లో తొలి మహిళామేయర్‌గా కామాక్షి జయరామన్ పదవిని నిర్వహించారు. ప్రియ మాజీ పెరంబూర్ ఎంఎల్‌ఎ చెంగై శివం మనుమరాలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News