Sunday, March 16, 2025

ఐపిఎల్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పిన మెట్రో

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లీగ్ ప్రారంభమవుతున్న వేళ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. మ్యాచ్ జరిగే రోజు తాము నివసిస్తున్న ప్రాంతం సమీప మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకూ రానుపోనూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మ్యాచ్ ముగిసిన 90 నిమిషాల్లో లేదా.. అర్థరాత్రి ఒంటి గంట వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల డిమాండును బట్టి మ్యాచ్ జరిగే రోజున చివర బయలుదేరే రైలు టైమ్‌ని తెలియజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News