Thursday, November 14, 2024

చెన్నై మెట్రో రైల్ సిస్టంకు చైనా బ్యాంకు ఋణం

- Advertisement -
- Advertisement -

 

 

Chennai Metro

చెన్నై: బీజింగ్‌లో ఉన్న ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఎఐఐబి) దేశంలో హరిత రైల్ రవాణాని విస్తరించేందుకుగాను చెన్నై మెట్రో రైల్ వ్యవస్థకుగాను 356.67 మిలియన్ డాలర్ల ఋణాన్ని ఆమోదించింది.

చెన్నై మెట్రో రైల్ రెండో దశలో భాగంగా చెన్నై మెట్రో నెట్‌వర్క్ కొత్త కారిడార్‌ను నిర్మించేందుకు దీనిని ఇవ్వనున్నట్లు ఎఐఐబి గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 103 సభ్యదేశాలున్న ఎఐఐబిలో చైనా, భారత్ టాప్ వాటాదారలుగా ఉన్నాయి.

“చెన్నై మెట్రో ప్రాజెక్ట్ తూర్పున లైట్‌హౌజ్ నుంచి పశ్చిమాన ఉన్న పూనమలీ బైపాస్ వరకు మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్‌ను అందిస్తుంది. ఇది సబర్బన్ రైల్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాన్ని కలిపేలా ఉంటుంది” అని ఎఐఐబి తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అమలు చేయనున్నదని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News