Monday, December 23, 2024

చెన్నైలో భారీ వర్షాలు..మూడు రోజులు స్కూళ్లకు సెలవు

- Advertisement -
- Advertisement -

చెన్నై: గురువారం నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు లోని చెన్నై లో గురువారం నుంచి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించడంతో చెన్నై నగరం, పొరుగునున్న జిల్లాల్లో తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మైలాదుతురై, నాగపట్నం, తిరువరూరు, తంజావూరు, పుదుక్కొట్టై , రామనాథపురం, తూతుకూడి జిల్లాల్లోను, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News