Monday, December 23, 2024

ఖమ్మంలో అట్టహాసంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -
సినీ నటి కృతి శెట్టి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా 17వ షో రూం ఆరంభం!

మన తెలంగాణ / ఖమ్మం : ఖమ్మంలో అధునాతన హంగులతో సరికొత్తగా రూపొందించుకున్న ది చెన్నై షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఖమ్మంలోని బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన 17వ చెన్నై షాపింగ్ మాల్ రూమ్‌ను ప్రముఖ సినీ నటులు కృతి శెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌లు షో రూంను లాంఛనంగా ప్రారంభించారు. శనివారం ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సినీ నటి కృతి శెట్టి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్ధన్ రెడ్డి, మర్రి వెంకట రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మర్రి జమునా రెడ్డి, మర్రి మధుమతిలు జ్యోతి ప్రజ్వలను చేసి షోరూం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్‌వేర్, కిడ్స్‌వేర్, జ్యుయలరీ, పలు వస్త్ర ఆభరణాల విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి కృతి శెట్టి మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్‌ను ఆదరించండని పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఇది రెండవ బ్రాంచ్ అని, రాష్ట్రంలో 17వ షోరూం అని దీని ప్రారంభోత్సవానికి తాను రావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని షోరూంల కంటే నమ్మకమైన నాణ్యమైన సరమైన ధరలకు లభించే వస్త్ర, ఆభరణాలు చెన్నై షాపింగ్ మాల్‌లోనే లభిస్తాయని సినీనటి కృతి శెట్టి అన్నారు.

మీ ఇంట జరిగే వేడుక ఏదైనా ఆ వేడుకకు గౌరవాన్ని తెచ్చే విధంగా వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్‌లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. మీ ఆదరాభిమానాలకు నాకు ఎల్లకాలం ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని అందుకు మీ ప్రేమాశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కృతి శెట్టి నూతన పట్టు వస్త్రాలను ప్రదర్శించారు. బంగారు, వెండి ఆభరణాలను ధరించి చూపరులను కనువిందు చేశారు. ఖమ్మంకు సినీనటి కృతిశెట్టి రావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. షోరూం పరిసరాలు జన సందోహంతో నిండిపోయాయి. కేరళ కళాకారుల నృత్యాలు, జబర్దస్త్ ఫేం శివారెడ్డి, ముక్కు అవినాష్, అదిరేఅభి, యాంకర్ మృదుల, తాగుబోతు రాజమౌళి హాస్యవల్లరి అభిమానులను.

Chennai shopping 3

Chennai Shopping Mall

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News