Tuesday, November 19, 2024

చెన్నైలో హాటెస్ట్ డే

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. కాగా ఆదివారం వెల్లూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. అక్కడి ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరంలో ఇదే అత్యంత వేడి రోజు(హాటెస్ట్ డే). ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారిక డేటాను విడుదల చేసింది. నుంగంబాక్కం, మీనంబాక్కం వాతావరణ స్టేషన్లలో గరిష్ఠంగా 40.7, 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 3.3, 2.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి.

చెన్నై వాతావరణ కేంద్రం హీట్ వార్నింగ్ జారీచేసింది. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని పేర్కొంది. చైన్నైలో వేడిని తట్టుకోలేక చాలా మంది ఆదివారం మెరీనా బీచ్ కు వెళ్ళి సేదదీరారు.

వాతావరణ కార్యాలయం మే 16 వరకు ఉష్ణోగ్రత హెచ్చరిక జారీచేసింది. ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ సలహాదారు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరగొచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News