Sunday, December 22, 2024

IPL 2023: బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ లో ఫేవరెట్లుగా భావిస్తున్న ముంబై ఇండియన్స్‌చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మరికాసేపట్లో కీలక పోరు జరుగనుంది. టాస్ గెలిచిన సిఎస్‌కె బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇప్పటి వరకు ఆడిన ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఒకదాంట్లో విజయం సాధించి మరోదాంట్లో పరాజయం చవిచూసింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ముంబై ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగానే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News