Sunday, December 22, 2024

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఢోకా లేదు!

- Advertisement -
- Advertisement -

ఎంఎస్. ధోని స్థానానికి ఏమైనా ఎసరవుతుందా?

చెన్నై: అల్ట్రాటెక్ ఆదివారం ఇండియా సిమెంట్స్‌ను కొనుగోలు చేసినప్పటికీ, IPL అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ ‘చెన్నై సూపర్ కింగ్స్’ ఎన్. శ్రీనివాసన్ , అతని కుటుంబం పట్టులో ఇప్పటికీ స్థిరంగా ఉంటుందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

2015 నుండి  ఫ్రాంచైజీ ‘చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్’ (CSKCL) అనే ప్రత్యేక సంస్థ క్రింద పనిచేస్తోంది, ఇది టేకోవర్ డీల్‌లో భాగం కాదు. అయితే  ఇండియా సిమెంట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎంఎస్‌. ధోని స్థానానికి ఎసరు వస్తుందా అనే దానిపై ఈ దశలో స్పష్టత లేదు. ధోనీ కాకుండా రాహుల్ ద్రవిడ్, ఆర్.అశ్విన్ సహా పలువురు ప్రముఖ క్రికెటర్లు ఇండియా సిమెంట్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News