Monday, December 23, 2024

మహి అద్భుత సారథ్యం వల్లే..

- Advertisement -
- Advertisement -

అపార అనుభవజ్ఞుడైన మహేంద్ర సింగ్ ధోని అద్భుత సారథ్యంతో చెన్నైకి మరోసారి ఐపిఎల్ ట్రోఫీ సాధించి పెట్టాడు. ఐపిఎల్‌లో తన సత్తా ఏ పాటిదో ధోనీ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించినా తనలో ఇంకా చేవ తగ్గలేదనే విషయాన్ని ఈ టోర్నీ ద్వారా ధోనీ మరోసారి ప్రపంచానికి చాటాడు. ఆరంభ మ్యాచ్ నుంచి ధోనీ సారథ్య ప్రతిభ స్పష్టంగా కనిపించింది.

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ చేతిలో ఓటమి పాలైనా ఆ తర్వాత నిలకడైన విజయాలతో చెన్నై లక్షం వైపు సాగి పోయింది. ఒకవైపు ధోని అద్భుత ప్రతిభకు సహచరుల సమష్టి కృషి కూడా తోడు కావడంతో చెన్నై ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా ముందుకు సాగి పోయింది. ఇతర జట్లతో పోల్చితే లీగ్ దశలో ధోని సేన అద్భుత ప్రదర్శన చేసిందనే చెప్పాలి. సమష్టిగా రాణిస్తూ ముందుకు సాగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News