- Advertisement -
చెన్నై: చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఎంఐ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఉంచింది. ముంబయి బ్యాట్స్‌మెన్లలో ఎవరూ దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడంతో స్వల్ప స్కోరు నమోదు చేసింది. ఎంఐ బ్యాట్స్‌మెన్లలో తిలక్ వర్మ(31), సూర్యాకుమార్ యాదవ్(29), దీపక్ చాహర్(28 నాటౌట్), నమన్ ధిర్(17), రైన్ రిక్‌ల్టన్(13), విల్ జాక్స్(11), మిచెల్ శాంట్నార్(11), రాబిన్ మింజ్(3), ట్రెంట్ బౌల్ట్(1), సత్యనారాయణ రాజు(1), రోహిత్ శర్మ(0) చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు, నాథన్ ఎలిస్, రవిచంద్రన్ అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు.
- Advertisement -