- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (63: 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు ) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (30), ఆయూష్ బదోని(22),అబ్దుల్ సమద్(20) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో జడేజా 2, పతిరన 2, ఖలీల్ అహ్మద్, కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
- Advertisement -