Friday, December 20, 2024

నేడే బెంగళూరు జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్న చెన్నై జట్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నేడు ఐపిఎల్ 2024 సీజన్ తాలూకు 68/74 వ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగబోతున్నది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. ఆరు జట్లు పోటీకి దూరం అయ్యాయి. నేడు జరిగే మ్యాచ్ తో ప్లే ఆఫ్ కు చేరబోయే ఒకే జట్టు బెంగళూరా లేక చెన్నై టీమా అన్నది తేలబోతుంది.

బెంగళూరు జట్టు వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ఈ స్థాయికి చేరుకుంది. బెంగళూరు ఇప్పుడు 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. మరోవైపు చెన్నై 14 పాయింట్లు, 0.528 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. ఒకవేళ వానపడి గేమ్ వాష్ అవుట్ అయితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ కు వెళుతుంది. ఆర్ సిబి  కనీసం 18 పరుగుల తేడాతో లేక 11 బాల్స్ తేడాతో గెలిస్తేనే ప్లేఆఫ్ కు వెళుతుంది. అన్ని కోణాలలో చూసినా చెన్నై జట్టు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ చివరిసారి తలపడబోతున్నారని వార్త. రాత్రి 07.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. చూద్దాం ఏమి జరుగనున్నదో.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News