Monday, January 20, 2025

నేడు ఢిల్లీతో చెన్నై కీలక పోరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) శనివారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తోంది. ఢిల్లీ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఢిల్లీకి కలిసివచ్చే అంశమేదీ ఉండదు. అయితే చెన్నైకి మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తోంది. ప్రస్తుతం చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సిఎస్‌కె చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

ఓపెనర్లు డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో వీరిద్దరూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. అజింక్య రహానె, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక తీక్షణ, పతిరణ, తుషార్, దీపక్, జడేజా, మోయిన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కూడా చివరి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News