Wednesday, January 22, 2025

ముంబయిపై గెలిచిన చెన్నై

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఏడు వికెట్ల తేడాతో సిఎస్‌కె గెలుపొందింది. ముంబయి జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో విఫలం కావడంతో ఓటమిని చవిచూసింది. ముంబయి విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై 18.1 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అజింక్య రహానే 27 బంతుల్లో 61 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. శివమ్ దూబే 26 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులు, అంబటి 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అజింక్య రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News