Monday, January 20, 2025

చెన్నమనేనికి సలహాదారు పదవి

- Advertisement -
- Advertisement -

కేబినెట్ హోదాలో వ్యవసాయరంగ సలహాదారుడిగా నియామకం

పదవి కాలం ఐదేళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ రంగం వ్యవహారాలకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో వీరు 5 ఏండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది. కాగా…విద్యాధికుడైన డా. చెన్నమనేని రమేశ్ బాబు, జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’ లో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను పొందారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా, వీరికి అగ్రికల్చర్ ఎకానమి’ అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపధ్యంలో వారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News