Wednesday, January 22, 2025

సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. చెన్నూరు మండలంలోని రైతులు సిఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు హామీలను అమలుచేయాలని కోరుతూ ఉత్తరాలు రాశారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని వారు సిఎంను కోరారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వారు గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు
వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ.500లు. రైతు భరోసా రూ.10వేలకి బదులు రూ.15వేలు ఇవ్వాలి. రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12వేలు చెల్లించాలి. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి. వీటితోపాటు రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25వేలు చెల్లించాలని లేఖలో సిఎం రేవంత్ రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు పోస్టు కార్డులు పంపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News