Monday, December 23, 2024

చివరి 30 నిమిషాలు విజువల్ ఫీస్ట్‌లా…

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి.ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. ఈనెల 9న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలకానున్న నేపధ్యంలో హీరో యష్ మీడియాతో మాట్లాడుతూ.. “అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది ఈ సినిమా.

మెలోడీ, డ్రామా, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. అయితే, ఇవన్నీ ఒక ప్యాకేజీలా వుండవు. స్టొరీ డిమాండ్ చేసింది కాబట్టే ఈ ఎలిమెంట్స్ అన్నీ కుదిరాయి. ఏదీ బలవంతంగా పెట్టింది కాదు. ఇందులో ప్రతి పాత్రకు మంచి గ్రాఫ్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఎంటర్‌టైనర్ ఇది. సినిమాలోని చివరి 30 నిమిషాలు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News