Saturday, December 21, 2024

ఆదరించి… ఆశీర్వదించండి

- Advertisement -
- Advertisement -
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మామడ/మామడ రూరల్: సీఎం కేసీఆర్ సారథ్యంలోని బిఆర్‌ఎస్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని మూడవసారీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలం వాస్తవపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అపూర్వ స్వాగతం లభించింది. గుస్సాడి నృత్యంతో మంగళహారతులతో బతుకమ్మ ఆటపాటలతో మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. వృద్ద్ధులు, యువ ఓటర్లను కలుస్తూ అభివృద్ధి ఆగవద్దు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బిఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు.ఇటీవల ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్ మేనిఫెస్టో నిరుపేదలకు వరంగా ఉదన్నారు.

బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చారు. అంతకుముందు వాస్తవాపూర్ ఆంజనేయస్వామిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎట్లుండే .. తెలంగాణ వచ్చినంకా మన బతుకులు ఎట్ల బాగుపడ్డాయో మన కళ్ల ముందు కనపడుతుందన్నారు. వాస్తవపూర్‌కు 25 ఏళ్ల క్రితం వరకు రోడ్డు లేకుండే ఒకప్పుడు ఈ ఊరుకు రావాలంటే ఒక రోజు పడుతుండే, గతంలోనే ఈ ఊరికి రహదారి సౌకర్యం కల్పించామన్నారు.

ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి మూడు నిమిషాల్లోనే వస్తున్నామన్నారు. గిరిజనులు లేని కల్మషం లేని మనుషులు , కొపతాపాలు ఉండవు , ఎన్నికల సమయంలో మీ ఊరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. అందుకే మీ ఆశీర్వాదం కోసం మీ ఊరికి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. తెలంగాణ వచ్చినకా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని, అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సీసీ రోడ్లు , డ్రైనేజీలు, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు, వ్యవసాయం, ఉచిత కరెంట్ , తండాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఇలా బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఊరువాడలో అన్ని వసతులను కల్పించామన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News