Thursday, January 23, 2025

నయూమే నన్నేం చేయలేకపోయాడు: చెరుకు సుధాకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తననేమీ చేయలేకపోయాడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేస్తాడు అని పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతి ఉండి మాట్లాడాడో లేక మతిలేక మాట్లాడాడో అర్థం కావడం లేదన్నారు. వెంకట్‌రెడ్డి తీవ్ర పదజాలం ఉపయోగించి, తన కుమారుడికి ఫోన్ చేసి తిట్టడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని తాను సీరియస్‌గా తీసుకుంటానని ప్రకటించారు. తాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా పని చేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని ప్రశ్నించారు.

తాను వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్ చేయలేదని పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి అసభ్యపదజాలంతో తిట్టిన ఆడియో రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుందన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరిరక్షణకు మాట్లాడుకున్నాం తప్పితే వెంకట్‌రెడ్డిని తాను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు ఏవీ లేవన్నారు. పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకట్‌రెడ్డి డకౌట్ అయిన వికెట్ అన్నారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకట్‌రెడ్డిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని చెరుకు సుధాకర్ కోరారు.చెరుకు సుధాకర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News