Thursday, January 23, 2025

చెరుకూరి వీరయ్య మరణం తీరని లోటు

- Advertisement -
- Advertisement -

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు చెరుకూరి వీరయ్య మృతి పట్ల భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురువారం ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన చెరుకూరి వీరయ్య చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడానికి విశేష కృషి చేశారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.

వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన చెరుకూరి వీరయ్యకి కృష్ణా , గోదావరి జలాల వినియోగం పై సంపూర్ణ అవగాహన ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు చెరుకూరి వీరయ్య విశ్రాంత ఇంజనీర్‌గా ఉంటూ గురువారం హైదరాబాద్‌లో మరణించారు. కాగా వారి మరణం రైతులోకానికి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News