Friday, December 27, 2024

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ.60లక్షలు

- Advertisement -
- Advertisement -

నార్కెట్‌పల్లి: తెలంగాణ శైవ క్షేత్రమైన చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం హుండి లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో గట్టుపై అమ్మవారి ఆలయ ఆదాయం రూ. 9,70,140రూపాయలు , గుట్టుపై స్వామివారి ఆలయ హుండి ఆదాయం రూ.60,31,100 లు మొత్తం రూ.70,01,240 లు, అదేవిదంగా అన్నదాన హుండీ ఆదాయం రూ.66,080 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ పరిశీలకురాలు ఎం. వెంకటలక్ష్మి,శ్రీ దుర్గ శివసాయి సేవసమితి సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News