Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ రసమయి కాన్వాయ్‌ని అడ్డుకున్న దళితులు

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యేయ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దళితులు ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా దళిత మహిళలు, యువకులు గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డంగా రోడ్డుపై బైఠయించి నిరసన తెలిపారు. రోడ్డు పై బైఠాయించిన యువకుల పై ఓ మండల ప్రజాప్రతినిధి మాట జారడంతో ఆందోళన నెలకొంది. వెంటనే పోలీసులు యువకులను,మహిళలను పక్కకు నెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపిపి ఉట్కూరి వెంకట రమణారెడ్డి దళితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామానికి చెందిన 20మంది దళితులకు డబుల్ బెడ్ రూం ల కింద రూ.5లక్షల40వేలు ఇప్పిస్తామని, ఒక్కోక్కరి దగ్గర రూ.10వేలు వసూలు చేశారని వాపోయ్యారు. మొత్తం రూ.2లక్షలు వసూలు చేసి ఏడాదిన్నర క్రితం ఇచ్చామని, అప్పటి నుండి ఉన్న ఇంటిని కూల్చీవేసుకుని పూరి గుడిసేలలో కాలం వెల్లదిస్తున్నామని వివరించారు. మేం భాదను చెప్పుకుందామని వస్తే మాపై ఇలా ఎదురు దాడి చేయడం సరైంది కాదని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఎంపిపి హామి ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రసమయి సానుకులంగా స్పందినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News