Wednesday, January 22, 2025

కార్ల్‌సన్‌ను నిలువరించిన ప్రజ్ఞానంద

- Advertisement -
- Advertisement -

బాకు (అజర్‌బైజాన్): చెస్ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ సంచలనం రమేశ్‌బాబు ప్రజ్ఞానం ద తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేశాడు. ఇద్దరు అద్భుత ఆటతో అలరించారు. తనకంటే ఎంతో మెరుగైన ఆటగా డు కార్ల్‌సన్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో భా రత యువ సంచలనం ప్రజ్ఞానంద ఎక్కడ కూడా ఒత్తిడికి గురి కాలేదు. కార్ల్‌సన్ ఎత్తులకు దీటైన జవాబిచ్చాడు. చివరికి 35 ఎత్తుల తర్వాత ఇ ద్దరు డ్రాకు అంగీకరించారు.

బుధవారం రెండో రౌండ్ జరుగనుంది. బుధవారం జరిగే గేమ్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కార్ల్‌సన్ తెల్లపావులతో బరిలోకి దిగనున్నాడు. ఇదిలావుంటే 18 ఏళ్ల భారత టీనేజ్ సంచలనం ప్రజ్ఞానంద ఈ ఛాంపియన్‌షిప్‌లో అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్‌కు దూ సుకొచ్చాడు. తొలి రౌండ్‌లో కార్ల్‌సన్‌ను నిలువరించడం ద్వారా పెను ప్రకంపనలు సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానందకే టై టిల్ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెస్ దిగ్గజా లు పేర్కొంటున్నారు. అయితే ప్రజ్ఞానందపై కార్ల్ సన్‌కు మెరుగైన రికార్డు ఉండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News