Friday, December 27, 2024

చేెవెళ్ల బస్టాండులో యువతిపై సామూహిక అత్యాచారం…..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: బస్టాండులో నిద్రపోతున్న యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి జూన్ నెలలో పెళ్లి జరిగింది. భర్తకు, భార్యకు మధ్య విభేదాలు రావడంతో తన తల్లిగారింట్లో నివసిస్తోంది. తల్లిదండ్రులకు కూతురు మధ్య గొడవలు జరగడంతో చేవెళ్లలోని తన అక్క దగ్గరికి వెళ్లింది. అక్క కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగింది. ఇంటికి వెళ్లలేక చేవెళ్ల బస్టాండులో కల్లు తాగి పడుకుంది. బస్టాండులో యువతి ఒంటరిగా పడుకున్నప్పుడు ఇద్దరు యువకులు గమనించారు.

రాత్రి పది గంటల తరువాత బస్టాండులో ఎవరు లేని సమయంలో యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. యువతి వివస్త్రంగా ఉండడంతో ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి టివి ఫుటేజీ ఆధారంగా అనిల్ కుమార్, రాజులను అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News