Saturday, December 21, 2024

చేవెళ్లలో శిశువును చంపి దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరంపల్లి గ్రామంలో పాపను చంపేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరంపల్లి గ్రామంలో ఉమ్మెత్తల అశోక్-అంకిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల కూతురు ఉంది. అశోక్-అంకిత అనే దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం క్యారెట్లు తీసుకొని నగరంలోని మార్కెటుకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అప్పుడే ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News