Wednesday, January 22, 2025

’అన్నీ మంచి శకునములే’ నుంచి ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

స్వప్న సినిమా బ్యానర్‌పై నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’అన్నీ మంచి శకునములే’. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి ఇతర ముఖ్య తారాగణం. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నాలుగవ పాట ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం’ను విడుదల చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ఈ పాట చూసినప్పుడు ‘పెళ్లి సందడి’ చూసినంత ఆనందం కలిగింది. పెళ్లి సందడి చిత్రం అంత పెద్ద విజయం ఈ సినిమా సాధిస్తుంది”అని తెలిపారు. అశ్వినీదత్ మాట్లాడుతూ “నా జీవితంలో మర్చిపోలేని వేడుక ఇది. చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత అరవింద్‌తో, రాఘవేంద్రరావులతో గొప్ప స్నేహం ఏర్పడింది. మేము ముగ్గురం ఎన్నో గొప్ప సినిమాలు తీశాం”అని చెప్పారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ నేను పరిశ్రమలోకి వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వనీదత్.. ఈ ముగ్గురికి కలసి కథ చెప్పడం నా అదృష్టం.ఈ ముగ్గురు నాకు మంచి శకునం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక దత్, స్వప్న దత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News