హైదరాబాద్: 2025 సంవత్సరం ఆరంభంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ఏదంటే అది ‘ఛావా’ అనే చెప్పుకోవాలి. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగానూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.484 కోట్ల వసూళ్లు సాధించి రూ.500 కోట్ల క్లబ్‌కి చేరువలో ఉంది. ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి.
తెలుగులో కాకుండా.. ఈ సినిమాను హిందీలోనే ఇక్కడ విడుదల చేశారు. దీంతో చాలా మంది హిందీ అర్థం కానీ వారు సినిమాను చూడలేకపోయారు. కానీ, ఇప్పుడు అలాంటి సిని ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ ఛావా సినిమాను తెలుగు భాషలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెబుతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాను తెలుగులో మార్చి 7న విడుదల కానుంది.